చిలీ సముద్రతీరంలో మరో భూకంపం | earth quake rocks sea off Chile | Sakshi
Sakshi News home page

చిలీ సముద్రతీరంలో మరో భూకంపం

Apr 3 2014 10:42 AM | Updated on Sep 2 2017 5:32 AM

చిలీ సముద్ర తీరం మీద మరోసారి భూకంపం విరుచుకుపడింది. 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది.

చిలీ సముద్ర తీరం మీద మరోసారి భూకంపం విరుచుకుపడింది. బుధవారం 8.3 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరోసారి 7.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది.

ఈ భూకంపం సముద్ర తీరంలో రావడంతో భూకంపకేంద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. బుధవారం వచ్చిన భూకంపం వల్ల కూడా సునామీ రావచ్చని పేర్కొన్నా.. ఆ ప్రమాదం మాత్రం రాలేదు. అయినా, ముందుజాగ్రత్త చర్యగా తీరప్రాంతాల్లోని వారిని ప్రభుత్వం ఖాళీ చేయించింది.

Advertisement
 
Advertisement
Advertisement