కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం | college girl raped in Pune, accused arrested | Sakshi
Sakshi News home page

కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

Oct 2 2014 3:17 PM | Updated on Oct 8 2018 5:45 PM

కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం - Sakshi

కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

ఓ యువతికి దారి చూపిస్తానని నమ్మబలికి ఆమెపై అత్యాచారం చేశాడో కామాంధుడు.

పుణే: ఓ యువతికి దారి చూపిస్తానని నమ్మబలికి ఆమెపై అత్యాచారం చేశాడో కామాంధుడు. మహారాష్ట్రలోని పుణే నగరంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నగరానికి కొత్తగా వచ్చిన 18 ఏళ్ల విద్యార్థిని బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ వద్ద నివసిస్తున్న తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బయలుదేరింది.

అయితే మాల్దాక్కా చౌక్ ప్రాంతానికి చేరుకున్నాక ఆమె దారి మర్చిపోయింది. అక్కడే ఉన్న నావల్ జోసఫ్(32) అనే వ్యక్తిని సాయం కోరింది. దారి చూపిస్తానని నమ్మబలికి ఆమెను ఖడ్కీ ప్రాంతంలో ఓ నిర్జనప్రదేశంలోకి అతడు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా తన సెల్ఫోన్ తో ఆమెను అభ్యంతకరరీతితో ఫోటోలు తీశాడు. బాధితురాలు చివరకు అతడి బారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement