బరిలోకి హోంమంత్రి తనయుడు! | BJP releases second list of candidates | Sakshi
Sakshi News home page

బరిలోకి హోంమంత్రి తనయుడు!

Jan 22 2017 7:44 PM | Updated on Mar 29 2019 9:31 PM

బరిలోకి హోంమంత్రి తనయుడు! - Sakshi

బరిలోకి హోంమంత్రి తనయుడు!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది.

కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ కొడుకుకు బీజేపీ టికెట్‌
బీజేపీ రెండో జాబితా విడుదల


లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. 155 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తనయుడు పంకజ్‌ సింగ్‌కు బీజేపీ సీటు దక్కడం గమనార్హం. నోయిడా నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేయనున్నారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇటీవల కమలదళంలోకి చేరిన రీటా బహుగుణ జోషీకి ఆమె సొంత స్థానమైన లక్నో కంటోన్మెంట్‌ నుంచి బీజేపీ టికెట్‌ ఖరారు చేసింది. అలాగే సిద్ధార్థనాథ్‌ సింగ్‌కు అలహాబాద్‌ వెస్ట్‌ సీటును, గరిమా సింగ్‌కు అమేథీ సీటును కేటాయించింది.

Advertisement
 
Advertisement
Advertisement