మిలిటెంట్ల దాడిలో 17 మంది పోలీసులు మృతి | 17 policemen killed in Yemen attack | Sakshi
Sakshi News home page

మిలిటెంట్ల దాడిలో 17 మంది పోలీసులు మృతి

Jun 5 2014 5:02 PM | Updated on Aug 21 2018 5:46 PM

మరోమారు ఆల్ ఖైదా తీవ్ర వాదులు యెమెన్ లో విధ్వంసం సృష్టించారు.

ఆదేన్: మరోమారు ఆల్ ఖైదా తీవ్ర వాదులు యెమెన్ లో విధ్వంసం సృష్టించారు. ఆ రోజు ఆకస్మికంగా ఓ  పోలీస్ చెక్ పోస్ట్ పై దాడి చేసిన మిలిటెంట్లు 17మంది పోలీసులు మృతికి కారణమైయ్యారు. గురువారం వేకువజాము ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డ మిలిటెంట్లు బేహాన్ జిల్లాలోని షబ్వా ప్రాంతంలోని పోలీస్ చెక్ పోస్టులపై భీకరమైన కాల్పులు జరిపారు.  ఈ దాడికి పాల్పడిన వారు ఆల్ ఖైదాకు చెందిన వారిగా తాము భావిస్తున్నామని పోలీస్ అధికారి తెలిపారు.

 

మిలిటెంట్లతో తాము గంటన్నరకు పైగా పోరాటం చేశామన్నారు. ఇప్పటికి 17మంది పోలీసులు మృతిచెందగా, కొంతమంది ఆచూకీ కనిపించడం లేదన్నారు.ఈ ఘటనలో మూడు పోలీస్ వాహనాలు ధ్వంసం అయినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement