అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా వైఎస్సార్‌సీపీ కమిటీ | YSRCP Committee great support to aggrigold victims | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా వైఎస్సార్‌సీపీ కమిటీ

Jan 12 2018 1:55 AM | Updated on May 28 2018 3:04 PM

 YSRCP Committee great support to aggrigold victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ తొలి నుంచీ పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా వారికి అండగా నిలబడేందుకు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 11 మంది పార్టీ నేతలను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు.

ఈ కమిటీ ఆయా ప్రాంతాల వారీగా బాధితుల సమాచారం సేకరించడంతో పాటు వారికి అండగా నిలుస్తూ.. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కమిటీలో కొలుసు పార్థసారథి (కృష్ణా జిల్లా), ఆదిమూలపు సురేష్‌ (ప్రకాశం), పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ (నెల్లూరు), కురసాల కన్నబాబు (తూర్పు గోదావరి), ముదునూరి ప్రసాదరాజు (ప.గోదావరి), జోగి రమేశ్‌ (కృష్ణా), కొట్టమూడి సురేష్‌బాబు (వైఎస్సార్‌ జిల్లా), గౌరు వెంకటరెడ్డి (కర్నూలు), టీజేఆర్‌ సుధాకర్‌బాబు (గుంటూరు), మజ్జి శ్రీనివాసరావు (విజయనగరం), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు) ఉన్నారు. కమిటీ కోఆర్డినేటర్‌గా అప్పిరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారని ఆ ప్రకటనలో వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement