చిన్నారిపై హత్యాచారం: యువకుడు అరెస్ట్ | Youth Arrested for Allegedly Raping, Killing 5 Year Old Girl in karimnagar district | Sakshi
Sakshi News home page

చిన్నారిపై హత్యాచారం: యువకుడు అరెస్ట్

Mar 4 2016 10:28 AM | Updated on Jul 28 2018 8:53 PM

అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ పాపను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ : అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆ పాపను కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... కరీంనగర్ జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామానికి చెందిన జక్కు వెంకటస్వామి (24) అదే గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి... ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హతమార్చాడు.  

దీంతో మృతి చెందిన పాప తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడు వెంకటస్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement