ధోబి ఘాట్‌లో పడి యువకుడి మృతి | youngster killed | Sakshi
Sakshi News home page

ధోబి ఘాట్‌లో పడి యువకుడి మృతి

Apr 4 2015 10:29 PM | Updated on Sep 28 2018 3:39 PM

ధోబిఘాట్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.

హైదరాబాద్: ధోబిఘాట్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌లోని ధోబి ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ యువకుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

మృతుడు దానమ్మ జోఫ్డి ప్రాంతంలో తిరిగే నదీం (19) అని కొందరు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement