ప్రమాదవశాత్తు యువరైతు మృతి | young farmer died in warangal district | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు యువరైతు మృతి

Aug 28 2015 10:32 PM | Updated on Sep 3 2017 8:18 AM

పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ యువరైతు గురువారం రాత్రి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు.

చెన్నారావుపేట(వరంగల్): పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ యువరైతు గురువారం రాత్రి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. కానీ ఈ సంఘటన శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గుంటూరుపల్లి గ్రావూనికి చెందిన చుండు వెంకటేష్(25) గురువారం రాత్రి పంటకు నీరు పెట్టడానికి కోనాపురం శివారులోని గాదెనాయుక్ కుంట సమీపంలో ఉన్న వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లాడు.

మోటర్ పెట్టడానికి లెవల్ లేకపోవడంతో పైపును ఊపడంతో అది కాస్త విరిగింది. దీంతో వెంకటేష్ బావిలో పడి మృతి చెందాడు. ఈయన నల్లబెల్లి వుండలంలో ఈజీఎస్‌లో టీఏగా పనిచేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement