యాదాద్రిలో భక్తులరద్దీ | Yadagirigutta Yadadri Temple Crowded | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో భక్తుల రద్దీ

May 27 2018 12:53 PM | Updated on Aug 29 2018 4:18 PM

Yadagirigutta Yadadri Temple Crowded - Sakshi

సాక్షి,యాదగిరిగుట్ట : తెలంగాణ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ్మస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది. సెలవుల కావడంతో  భక్తులు  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయి. దీంతో భక్తులు కుటుంబసమేతంగా రావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ పునర్నిర్మాణం కారణంగా స్థలాభావంతోపాటు పార్కింగ్‌, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు వాహనాలను కొండ పైకి అనుమతించడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement