బోరబండలో రోడ్డుపైనే మహిళపై దాడి!

సాక్షి, హైదరాబాద్ : రోడ్డుపైనే ఓ మహిళను ఇష్టానుసారంగా కొట్టాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించి వీడియోను కార్తీక్ రేవూరి అనే ఓ నెటిజన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేయడంతో వెలుగు చూసింది. భారత దేశంలో ఇంకా ఇలాంటి బాధకరమైన సంఘటనలు పునరావృతమవున్నాయంటూ వీడియోను కార్తీక్ పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తి ఉన్నారు. వీరిలో యువకుడు ఓ మహిళతో గొడవపడుతూ బండిపైనుంచి దిగి దాడికి పాల్పడ్డాడు.
ట్విటర్ పోస్ట్‌కు స్పందించి పోలీసులు పూర్తి వివరాలు తెలపాలని కార్తీక్‌ను కోరగా, బోరబండలో ఈ సంఘటన జరిగినట్టు బదులిచ్చాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా గృహహింస ఎక్కువవుతోందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, రోడ్డుపైనే దాడి చేసినా అక్కడున్న వారెందుకు స్పందించలేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి