కరోనా నుంచి కోలుకొని ఇంటికొస్తే.. | Who Recovered From Coronavirus They are Faces Unexpected Situation At Medak | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకొని ఇంటికొస్తే..

Jun 5 2020 12:54 PM | Updated on Jun 5 2020 1:10 PM

Who Recovered From Coronavirus They are Faces Unexpected Situation At Medak - Sakshi

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా చేగుంటలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి కోలుకొని సంతోషంతో పుట్టిన ఊరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చేదు ఘటన ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చేగుంటకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో ఆస్పత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్‌లో చికిత్స అందించారు. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని హోం ఐసోలేషన్‌కు వచ్చిన సదరు వ్యక్తులను గ్రామస్థులు అడ్డుకున్నారు. 

అంతేకాకుండా ఆ ఇద్దరు గ్రామంలోకి రావద్దంటూ చేగుంట గ్రామపంచాయతీ ముందు ధర్నాకు దిగారు. దీంతో అధికారులు గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఎంతకీ వినడం లేదు. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రాణాంతక కరోనా నుంచి కోలుకొని వచ్చిన వారిపై కనీస సానుభూతి ప్రదర్శించకుండా గ్రామస్థులు నిర్దాక్షిణ్యంగా అడ్డుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement