పిడుగుపాటుకు ఇద్దరి మృతి | Two dies due to Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

Jun 4 2015 6:11 PM | Updated on Aug 25 2018 6:06 PM

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఆసిఫాబాద్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల ప్రకారం.. వాంకిడి మండలం కమాన గ్రామంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో పనులు చేసుకుంటున్న ఆర్‌జె. రాజన్న(40), ఆర్‌జె విమలాబాయి(38)  వర్షానికి చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగుపడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement