గోదావరిలో అన్నదమ్ముల గల్లంతు | Two brothers missing in Godavari | Sakshi
Sakshi News home page

గోదావరిలో అన్నదమ్ముల గల్లంతు

Dec 11 2015 8:13 PM | Updated on Aug 25 2018 6:52 PM

బైక్ పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు అదుపుతప్పి గోదావరిలో పడి గల్లంతయ్యారు.

మహదేవ్‌పూర్ (కరీంనగర్) : బైక్ పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు అదుపుతప్పి గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కుంట్లం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది. కాళేశ్వరంకు చెందిన అల్తాఫ్, సల్మాన్ అనే ఇద్దరు యువకులు బైక్‌పై గోదావరి దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్‌తో సహా గోదావరిలో పడి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement