టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం | TRS Leader Died In Road Accident Khammam | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నాయకుడి దుర్మరణం

Jan 24 2019 7:46 AM | Updated on Jan 24 2019 7:46 AM

TRS Leader Died In Road Accident Khammam - Sakshi

వనపర్తి సత్యనారాయణ

అశ్వారావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతిచెందాడు. మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వనపర్తి సత్యనారాయణ(53), బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేటలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి వస్తున్నాడు. భద్రాచలం రోడ్‌లోని రైస్‌ మిల్‌ సమీపంలో ఇతడి వాహనాన్ని ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లింది.

తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement