టీఆర్‌ఎస్‌లో చేరిన ‘ఖని’ కాంగ్రెస్ కార్పొరేటర్లు | TRS joined the 'khani' Congress corporators | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన ‘ఖని’ కాంగ్రెస్ కార్పొరేటర్లు

Apr 22 2016 2:58 AM | Updated on Aug 30 2019 8:24 PM

టీఆర్‌ఎస్‌లో చేరిన ‘ఖని’ కాంగ్రెస్ కార్పొరేటర్లు - Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన ‘ఖని’ కాంగ్రెస్ కార్పొరేటర్లు

రామగుండం కార్పొరేషన్‌కు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
 
 గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్‌కు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గురువారం స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 1, 2, 3, 6, 28, 29, 35, 36 డివిజన్ కార్పొరేటర్లు బద్రి రజిత, నస్రీనాబేగం, కత్తెరమల్ల సుజాత, నడిపెల్లి అభిషేక్‌రావు, షేక్ బాబూమియా, బొబ్బిలి సతీష్,  చుక్కల శ్రీనివాస్, పాముకుంట్ల లలిత టీఆర్‌ఎస్‌లో చేరడానికి హైదరాబాద్ బయలుదేరారు. వారి వాహన శ్రేణి ని నగర మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్ తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, రాజయ్య, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డెప్యూటీ మేయర్ సాగంటి శంకర్, అధ్యక్షుడు దీటి బాలరాజు, నాయకులు సోమారపు అరుణ్‌కుమార్, నడిపెల్లి సాగర్‌రావు, పాముకుంట్ల భాస్కర్, బద్రి రాజు పాల్గొన్నారు. కాగా.. ఎనిమిది మంది కార్పొరేటర్లు చేరడంతో రామగుండం కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ బలం 36కు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement