'రైతుల ఆత్మహత్యలపై..నిమ్మకు నీరెత్తినట్లు టీఆర్ఎస్' | TRS is not responding on farmer suicide issue, says ponnala | Sakshi
Sakshi News home page

'రైతుల ఆత్మహత్యలపై..నిమ్మకు నీరెత్తినట్లు టీఆర్ఎస్'

May 13 2015 12:42 PM | Updated on Sep 3 2017 1:58 AM

'రైతుల ఆత్మహత్యలపై..నిమ్మకు నీరెత్తినట్లు టీఆర్ఎస్'

'రైతుల ఆత్మహత్యలపై..నిమ్మకు నీరెత్తినట్లు టీఆర్ఎస్'

తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న రైతు భరోసాయాత్ర చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న రైతు భరోసాయాత్ర చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అధికార టీఆర్ఎస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని ఆయన విమర్శించారు. తాము చేపట్టే రైతు భరోసాయాత్ర రాజకీయాల కోసం కాదు, రైతులలో ఆత్మస్థైర్యం నింపడం కోసమేనని పొన్నాల చెప్పారు. ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement