విషాదం మిగిల్చిన సెల్ఫీ సరదా | Tragedy while taking selphies | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన సెల్ఫీ సరదా

Sep 21 2018 2:10 AM | Updated on Sep 21 2018 8:11 AM

Tragedy while taking selphies - Sakshi

సోను(ఫైల్‌) , సోఫిల్‌(ఫైల్‌)

ఎదులాపురం (ఆదిలాబాద్‌): సెల్ఫీ మోజు రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. బోటింగ్‌ సమయంలో సెల్ఫీకి ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌ కాలనీకి చెందిన సోను, సోఫీల్, ఉమేర్, ఇర్ఫాన్, మన్సూర్‌లు మోటార్‌ సైకిళ్లపై బుధవారం మొహర్రం వేడుకలను చూడటానికి చంద్రపూర్‌ జిల్లా రాజురాకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని పెన్‌గంగ ముకుడ్‌బంద్‌ ప్రాంతంలో గురువారం బోటింగ్‌ నిమిత్తం ఆగారు. బోటింగ్‌ చేస్తున్న తరుణంలో మధ్యలోకి వెళ్లిన వారు సెల్ఫీ దిగేందుకు యత్నించారు. ఈ తరుణంలో ఒకే వైపు భారం పడటంతో బోటు బోల్తా పడింది. గమనించిన స్థానికులు రక్షణ చర్యలు చేపట్టారు. అప్పటికే గల్లంతైన సోను(22), సోఫిల్‌(23) నీటమునిగి మృతిచెందారు. ఉమేర్, ఇర్ఫాన్‌లు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement