ఇంటి ముందున్న మూడు బైక్‌లు దగ్ధం | Three bikes were burnt in front of the house | Sakshi
Sakshi News home page

ఇంటి ముందున్న మూడు బైక్‌లు దగ్ధం

Dec 30 2015 12:00 PM | Updated on Sep 2 2018 4:16 PM

వరంగల్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని ఎల్బీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలిపి ఉంచిన మూడు బైక్‌లు, ఓ సైకిల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో దగ్ధమయ్యాయి.

వరంగల్ జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని ఎల్బీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి ముందు నిలిపి ఉంచిన మూడు బైక్‌లు, ఓ సైకిల్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో దగ్ధమయ్యాయి. బిజిగిరి అమర్‌నాథ్ సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి ఇంటి ఆవరణలో ఉన్న మూడు బైక్‌లు, ఓ సైకిల్‌కు అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా నిప్పంటించారా లేక షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement