ముఖంపై స్ప్రే కొట్టి చోరీ | Theft in janagone | Sakshi
Sakshi News home page

ముఖంపై స్ప్రే కొట్టి చోరీ

Jul 9 2017 1:53 AM | Updated on Aug 30 2018 5:27 PM

దంపతుల ముఖంపై మత్తు పదార్థం స్ప్రే చేసిన దొంగలు నగలతోపాటు నగదు ఎత్తుకెళ్లిన సంఘటన జనగామ మండలం పెంబర్తిలో శుక్ర వారం అర్ధరాత్రి జరిగింది.

రూ.1.20 లక్షల నగదు, 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణ
జనగామ: దంపతుల ముఖంపై మత్తు పదార్థం స్ప్రే చేసిన దొంగలు నగలతోపాటు నగదు ఎత్తుకెళ్లిన సంఘటన జనగామ మండలం పెంబర్తిలో శుక్ర వారం అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున మత్తు నుంచి తేరుకున్న బాధితులు  లబోదిబోమన్నారు. గ్రామానికి చెందిన బూరు శ్రీనివాస్‌ పెంబర్తిలో కిరాణ దుకాణం నడుపుకుంటున్నాడు.

శుక్రవారం అర్ధరాత్రి ఇంటి తలుపు వద్ద శబ్దం వినిపించడంతో శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య కిటికీ వద్దకు వెళ్లారు. అక్కడే కాచుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు అందులో నుంచి మత్తు పదార్థాన్ని వారి ముఖంపై స్ప్రే చేయడంతో వెంటనే నిద్రలోకి జారు కున్నారు. అనంతరం దొంగలు తాళాన్ని పగులగొట్టి ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. దీనిపై బాధితు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘ టనలో రూ.1.20 లక్షల నగదు, 20 తులాల వెండి, 3 తులాల నగలను ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement