వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందంటూ.. | The victims protest at the hospital | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందంటూ..

Feb 23 2016 8:50 AM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.

నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బూధాన్ పోచంపల్లి మండలం కప్రాయిపల్లికి చెందిన బి.రాములమ్మ (35) అనారోగ్యంతో సోమవారం రాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందగా... వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement