
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. ఇ ప్పటివరకు కేసుల సంఖ్య 2,792కు చేరుకుంది. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 నమోదయ్యాయి. అలాగే ఇతర జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశా రు.
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రా ష్ట్రానికి చెందిన కేసులు 2,358 ఉండగా, వలస కార్మికులు, సౌదీ అరేబియా, సడలింపుల తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు 434 ఉన్నాయి. అందులో వలస కార్మికులకు సంబంధించినవి 192, సౌదీ అరేబి యా నుంచి వచ్చినవి 212 కేసులు ఉ న్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 88 మంది చనిపోయారు. మొత్తం 1,491 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,213 మంది చికిత్స పొందుతున్నారు. గత 14 రోజు లుగా ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లో సిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భద్రాద్రి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గద్వాల ఉన్నాయి.
మాజీ ఎమ్మెల్యేకు కరోనా..
హైదరాబాద్‌లో ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. దీంతో ఆయనను సోమవారం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యం ప్రజల కు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంలో ఆయ నకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిం ది. అలాగే, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమవారం మరో ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా సోకింది.