రెండో రోజు 559 నామినేషన్లు | Telangana Panchayat Elections Nominations Khammam | Sakshi
Sakshi News home page

రెండో రోజు 559 నామినేషన్లు

Jan 9 2019 7:48 AM | Updated on Jan 9 2019 7:48 AM

Telangana Panchayat Elections Nominations Khammam - Sakshi

పాల్వంచ మండలం పాయకారియానంబైల్‌ పంచాయతీలో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేస్తున్న దృశ్యం

చుంచుపల్లి: ఈనెల 21న తొలి విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 559 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశలో ఏడు మండలాల పరిధిలోని 174 పంచాయతీలు, 1534 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. ఇక రెండో రోజు సర్పంచ్‌కు 124 మంది, వార్డులకు 435 మంది నామినేషన్లు సమర్పించారు.

ఇందులో అశ్వాపురం మండలంలో సర్పంచ్‌కు 21, వార్డులకు 77, బూర్గంపాడు మండలంలో సర్పంచ్‌కు 23, వార్డులకు 62, చర్ల మండలంలో సర్పంచ్‌కు 16, వార్డులకు 48, దుమ్ముగూడెం మండలంలో సర్పంచ్‌ 13, వార్డులకు 77, మణుగూరు మండలంలో సర్పంచ్‌ 4, వార్డులకు 47, పాల్వంచ మండలంలో సర్పంచ్‌ 28, వార్డులకు 72, ములకలపల్లి మండలంలో సర్పంచ్‌ 19, వార్డులకు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో మొత్తం 634 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచులకు 147, వార్డులకు 487 ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement