శ్రీవారి ఆశీస్సులతోనే 'తెలంగాణ' కల నెరవేరింది : కొప్పుల | Telangana Chief whip Koppula Eswar visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆశీస్సులతోనే 'తెలంగాణ' కల నెరవేరింది : కొప్పుల

Jun 6 2015 7:00 PM | Updated on Sep 3 2017 3:19 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తెలంగాణ కల నెరవేరిందని ఆ రాష్ట్ర చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు.

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే తెలంగాణ కల నెరవేరిందని ఆ రాష్ట్ర చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో శ్రీవారిని దర్శించుకుని స్వామివారిపై భారం వేసి వెళ్లానని, ఆయన ఆశీస్సులతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తమ రాష్ట్రం నేడు మంచి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement