ప్రియుడి కోసం దేశం దాటొచ్చింది..! | Telangana Boy Cheated Nepali Girl In The Name Of Love | Sakshi
Sakshi News home page

ప్రేమలో మోసపోయి ప్రియుడి కోసం దేశం దాటొచ్చింది..!

Dec 8 2019 8:43 AM | Updated on Dec 8 2019 8:48 AM

Telangana Boy Cheated Nepali Girl In The Name Of Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వెల్గటూరు(ధర్మపురి): ఇరాక్‌ వేదికగా తెలంగాణ అబ్బాయి, నేపాల్‌ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఐదేళ్లు అక్కడే కలిసి కాపురం చేశారు. చుట్టీ మీద ఇంటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడు ఇండియాకు చేరాడు. ఫోన్‌ నంబరు మార్చడంతో మోసపోయానని గ్రహించిన సదరు యువతి ఇరాక్‌ నుంచి నేరుగా వెల్గటూరు చేరుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన అల్లె చంద్రశేఖర్‌ బతుకుదెరువుకు ఐదేళ్ల క్రితం ఇరాక్‌వెళ్లాడు. నేపాల్‌కు చెందిన లలితఅన్నా సైతం ఉపాధి నిమిత్తం ఇరాక్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐదేళ్లు కలిసికాపురం సైతం చేశారు.

ఇటీవల అక్టోబర్‌లో చంద్రశేఖర్‌ చుట్టీమీద స్వగ్రామం వెంకటాపూర్‌ వచ్చాడు. కొద్దిరోజులు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తరువాత చంద్రశేఖర్‌ ఫోన్‌నంబర్‌ మార్చివేశాడు. లలితకు చాలారోజుల నుంచి ఫోన్‌ చేయకపోవడంతో తనవద్ద ఉన్న రాజశేఖర్‌ ఓటర్‌ ఐటీ ఆధారంగా శనివారం వెల్గటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. చంద్రశేఖర్‌ తనకు పెళ్లి కాలేదని చెప్పి ప్రేమపేరుతో లోబర్చుకున్నాడని, అతడికిపెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి మోసపోయాయని వాపోయింది. పోలీసులే తనకు న్యాయం జరిగేలా చూడాలని లలిత వేడుకుంటోంది. 

Advertisement
 
Advertisement
Advertisement