చిట్టీల వ్యాపారం.. రూ.3 కోట్లతో పరార్! | Jagtial Chit Funds Scam Incident | Sakshi
Sakshi News home page

చిట్టీల వ్యాపారం.. రూ.3 కోట్లతో పరార్!

Jul 6 2026 10:56 AM | Updated on Jul 6 2026 11:12 AM

Jagtial Chit Funds Scam Incident

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని విజయపురికాలనీకి చెందిన ఓ వ్యాపారి వారంరోజులుగా కనిపించడం లేదు. విజయపురిరోడ్డులో 30 ఏ ళ్లుగా కిరాణషాపుతోపాటు చిట్టీల వ్యాపా రం చేస్తున్న సదరు వ్యాపారి దాదాపు 60 నుంచి 70 మంది వద్ద అధిక వడ్డీ ఆశ చూపి అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలంగా చిట్లీ వేసినవారు.. అప్పు ఇచ్చిన వారు డబ్బులు కావాలని నిలదీస్తుండటంతో వారం క్రితం పరారయినట్లు తెలుస్తోంది. 

ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అప్పు ఇచ్చినవారు ఇల్లు గురించి వాకబు చేయగా.. వేరే వ్యక్తికి రిజిస్టర్‌ చేసిన ట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టినట్లు స మాచారం. ఇటీవల ఆన్‌లైన్‌ యాప్‌లన్నీ మూతపడటంతో పలువురు బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొంతమంది పరారవుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement