పథకాలు సద్వినియోగం చేసుకోండి | Take advantage of the schemes | Sakshi
Sakshi News home page

పథకాలు సద్వినియోగం చేసుకోండి

Jun 2 2017 2:24 AM | Updated on Aug 20 2018 9:18 PM

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన వారంతా వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు.

రామకృష్ణాపూర్‌(చెన్నూర్‌): ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులైన వారంతా వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. దీన్‌దయాల్‌జయంతి ఉత్సవాల్లో భాగంగా రామకృష్ణాపూర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో గురువారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కోసం ప్రవేశపెట్టిన  ఫసల్‌ బీమా పథకం, సడక్‌ బీమా యోజన పథకంతో పాటు వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా పట్టణానికి చెందిన పలువురు యువకులు పార్టీలో  చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరుముల్ల పోషం, జిల్లా ఉపాధ్యక్షుడు బంగారి వేణు, ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, నాయకులు మేకల రమేష్, సతీష్, పూర్ణచందర్, బత్తుల నరేష్, రాంకిషోర్‌ , యూసఫ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement