రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు | T.rajaiah controversial comments about | Sakshi
Sakshi News home page

రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Feb 9 2015 12:26 PM | Updated on Aug 15 2018 9:27 PM

రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు - Sakshi

రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు.

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా  నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు. ఏదైనా నియోజకవర్గ ఇంచార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే... జరగాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  రాజయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య.. అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు. మరోవైపు ఆయన  ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. కాగా తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement