సెక్షన్-8పై ఓయూ విద్యార్థి నాయకుల ఆగ్రహం | student protests for section 8 | Sakshi
Sakshi News home page

సెక్షన్-8పై ఓయూ విద్యార్థి నాయకుల ఆగ్రహం

Jun 23 2015 11:19 PM | Updated on Nov 9 2018 4:59 PM

సెక్షన్-8 అమలుపై ఓయూ విద్యార్థి నాయకుల ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వల్లమల్ల కృష్ణ, మంద సురేష్, శంకర్‌నాయక్, కరాటే రాజు తదితరులు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో ఆగ్రహాం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: సెక్షన్-8 అమలుపై ఓయూ విద్యార్థి నాయకుల ఆంజనేయగౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వల్లమల్ల కృష్ణ, మంద సురేష్, శంకర్‌నాయక్, కరాటే రాజు తదితరులు మంగళవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపై ఎలాంటి దాడులు, ఇతర గటనలు జరగకున్నా సెక్షన్-8 తెరపైకి తెచ్చి గవర్నర్‌కు శాంతి భద్రతల అధికారాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పై ఓయూ విద్యార్థి నాయకులు ధ్వజమెత్తారు.

 

సెక్షన్-8 పైన చంద్రబాబునాయుడు కపట నాటకం ఆపకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వేస్తున్న కొత్త ఎత్తుడగా విద్యార్థి నాయకులు అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement