విశాఖకు ప్రత్యేక రైళ్లు | Special trains to Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖకు ప్రత్యేక రైళ్లు

May 9 2014 1:03 AM | Updated on Apr 7 2019 3:23 PM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో  కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు. కాచిగూడ-విశాఖ (07016) ఈ నెల 10వ తేదీ రాత్రి  11 గంటలకు  కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-కాచిగూడ (07015) 11వ తేదీ సాయంత్రం 7.05 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. మల్కాజ్‌గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికూడి, గుంటూరు,  విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం,తుని,అనకాపల్లి,దువ్వాడ స్టేషన్‌లలో ఆగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement