కారు ఢీ: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గాయాలు | Software engineer injured in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీ: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గాయాలు

Dec 8 2015 7:51 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డుప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నాగోలు (హైదరాబాద్) : రోడ్డుప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... మన్సూరాబాద్ భరత్‌నగర్ కాలనీకి చెందిన బి.నాగరాజు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. సోమవారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై దిల్‌సుఖ్‌నగర్ నుంచి వనస్థలిపురం వెళ్తుండగా ఎల్‌బీ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement