ఠాణా నుంచి ఏడుగురు దొంగల పరారీ | Seven thieves escape from the Thana | Sakshi
Sakshi News home page

ఠాణా నుంచి ఏడుగురు దొంగల పరారీ

Jun 23 2014 1:12 AM | Updated on Jul 11 2019 7:49 PM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పోలీస్‌స్టేషన్ నుంచి శనివారం అర్ధరాత్రి ఏడుగురు నిందితులు తప్పించుకున్నారు.

మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పోలీస్‌స్టేషన్ నుంచి శనివారం అర్ధరాత్రి ఏడుగురు నిందితులు తప్పించుకున్నారు. మంచిర్యాలలోని గౌతమీనగర్, హైటెక్ సిటీతోపాటు బంగారు దుకాణాలు, నివాస గృహాల్లో దొంగతనానికి సంబంధించి పలు కేసుల్లో నిందితులు. మూడు రోజుల క్రితం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి నలుగురిని లాకప్‌లో వేసి తాళాలు టేబుల్‌పై పెట్టారు. మిగిలిన ముగ్గురిని స్టేషన్ ఆవరణలో ఉంచారు. విధుల్లో ఉన్న గార్డ్ అండ్ జీడీ ఇన్‌చార్జి, హోంగార్డ్, కానిస్టేబుళ్లు నిద్రలోకి జారుకున్నారు.

ముగ్గురు అనుమానితులు లాకప్ తెరవడంతో అందరూ కలిసి పరారయ్యారు. లాకప్ పక్కనే ఉన్న చెక్క తలుపులు పగులగొట్టి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం  పోలీసులు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ రమణకుమార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేశ్‌లతోపాటు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ఐడీ పార్టీ పోలీసులు అప్రమత్తమై  తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement