రామాలయంలో చోరీ | Robbery in Temple | Sakshi
Sakshi News home page

రామాలయంలో చోరీ

Jun 28 2015 11:11 AM | Updated on Aug 30 2018 5:27 PM

నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలంలోని రామాలయంలో చోరీ జరిగింది.

నల్లగొండ (బీబీనగర్) : నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలంలోని రామాలయంలో చోరీ జరిగింది. మండలంలోని బుట్టాయగూడెం గ్రామంలో ఉన్న రామాలయంలోకి శనివారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు మూడు వెండి కిరీటాలు, ఓ బంగారు పుస్తెను ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలెత్తుకెళ్లిన వస్తువుల విలువ రూ.లక్ష ఉంటుందని స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement