రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మెయిన్‌రోడ్డుపై ఉన్న ఆంధ్రా బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.
ఆంధ్రా బ్యాంక్‌లో చోరీ
Feb 15 2016 12:26 PM | Updated on Aug 30 2018 5:27 PM
ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మెయిన్‌రోడ్డుపై ఉన్న ఆంధ్రా బ్యాంక్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. బ్యాంక్ వెనుక వైపు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి గుర్తు తెలియని దుండగులు లోనికి ప్రవేశించారు. సోమవారం ఉదయం ఇది గుర్తించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


