ఉప్పొంగుతున్న గోదావరి | Rising water levels ring alarm bells | Sakshi
Sakshi News home page

ఉప్పొంగుతున్న గోదావరి

Jun 23 2015 4:14 AM | Updated on Aug 1 2018 3:59 PM

ఉప్పొంగుతున్న గోదావరి - Sakshi

ఉప్పొంగుతున్న గోదావరి

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు, ప్రాజెక్టుల నుంచీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద...

భద్రాచలం వద్ద 40.5 అడుగులకు నీటిమట్టం
భద్రాచలం: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు, ప్రాజెక్టుల నుంచీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది సోమవారం 40.5 అడుగులకు నీటిమట్టం చేరింది.  మొదటి ప్రమాద హెచ్చరిక (43 అడుగులు) చేరువలో వరద ఉధృతి ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలోని తొమ్మిది మండలాలు వరద తాకిడికి గురి కానున్న నేపథ్యంలో అధికారులు మంపు ప్రాతాంల్లో పర్యటించాలని జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. భద్రాచలం వద్ద స్నానఘట్టాలపైకి వరద నీరు చేరింది. భద్రాచలం డివిజన్‌లోని వాజేడు మండలంలో చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు  ప్రాజెక్టుకు వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్‌లో 6 స్తంభాలు నేలకొరిగాయి. ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement