ఘనంగా విజయమ్మ జన్మదిన వేడుకలు | richly Vijayamma birthday celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా విజయమ్మ జన్మదిన వేడుకలు

Apr 20 2015 3:50 AM | Updated on Jul 7 2018 2:56 PM

వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ...

- వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో  పండ్లు పంపిణీ
సాక్షి, ఖమ్మం:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ.ముస్తఫా ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్.విజయమ్మ జన్మదిన వేడుకలు ఆదివారం ఖమ్మంలో ఘనంగా జరి గాయి.

నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లోని జీవనసంధ్య వృద్ధాశ్రమంలో ముస్తఫా ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధి ముది రెడ్డి నిరంజన్‌రెడ్డిలు వృద్ధులకు పండ్లు, బ్రెడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహిళలు జీవి తంలో ఎదగాలంటే విజయమ్మలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం వృద్ధాశ్రమంలో కేక్ కట్‌చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్‌రావు, ఫయాజ్, కిషోర్, సుజన్, సాయి, రాజేష్, అబ్దుల్లా, అనిల్, సునీల్, ఉమర్, ఆరీఫ్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement