మంత్రివర్గ విస్తరణ ఎలా?: రేవంత్‌రెడ్డి | Revanth Reddy complained to the Election Commission | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ విస్తరణ ఎలా?: రేవంత్‌రెడ్డి

Feb 19 2019 4:06 AM | Updated on Mar 9 2019 4:19 PM

Revanth Reddy complained to the Election Commission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాష్ట్ర శాసనసభ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు సైతం ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాదని రేవంత్‌రెడ్డికి తెలిపామని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement