భారీ వర్షం.. వరదనీటిలో చిక్కుకున్న బస్సు! | Rain In Hyderabad | Sakshi
Sakshi News home page

Apr 1 2018 5:02 PM | Updated on Sep 28 2018 4:48 PM

Rain In Hyderabad - Sakshi

నగరంలో దొరికిన వడగండ్లు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆదివారం పలుచోట్ల ఆకస్మికంగా వర్షం ముంచెత్తింది. నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల భారీగా వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో మెట్టుగూడ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. ఈ వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కకుపోయింది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.

హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వర్షం పడగా.. సికింద్రాబాద్‌, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్‌గిరి, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్‌, నాగోల్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌లో వర్షం పడింది.  ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, హిమయత్‌నగర్‌, రాంనగర్‌, విద్యానగర్‌ ప్రాంతాల్లోనూ వర్షం పడింది.

Advertisement
 
Advertisement
Advertisement