క్షమాపణ చెప్పిన వీజీఎస్ ప్రచురణకర్తలు | Publishers apology VGS | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన వీజీఎస్ ప్రచురణకర్తలు

Dec 4 2014 2:00 AM | Updated on Apr 8 2019 7:51 PM

ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల గురించి అనుచిత ప్రస్తావన చేసినందుకు వీజీఎస్ ప్రచురణ కర్తలు క్షమాపణ ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ‘నైతికత, మానవ విలువలు’ పా ఠ్యాంశానికి సంబంధించిన స్టడీ మెటీరియల్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిల గురించి అనుచిత ప్రస్తావన చేసినందుకు వీజీఎస్ ప్రచురణ కర్తలు క్షమాపణ ప్రకటించారు.

జరిగిన తప్పిదాన్ని వెంటనే సవరిస్తామని, మార్కెట్లో ఉన్న స్టడీ మెటీరియల్(గైడ్) పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ‘విలువలకు తిలోదకాలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రచురణ సంస్థ స్పందించింది. ‘పుస్తక రచయిత చేసింది పొరపాటే. ప్రముఖ రాజకీయ నేతల పేర్లతో అనుచి తవ్యాఖ్యలు చేసినందుకు మేం చింతిస్తున్నాము.

ఈ విషయం మా దృష్టికి రాగానే స్టడీ మెటీరియల్‌లో ఆ అంశాన్ని తొలగించాము. స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకుంటున్నాము. తదుపరి వెలువరించే పుస్తకాల్లో ఇలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా జాగ్ర త్త పడుతాము. జరిగిన పొరపాటుకు తీవ్రంగా చింతిస్తున్నాము’ అని వీజీఎస్ ప్రచురణ సంస్థ గురువారం ప్రకటనలో తెలియజేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement