పొన్నాలకు మతిభ్రమించింది: శ్రీనివాస్‌గౌడ్ | PONNALA to lunacy: Srinivas Goud | Sakshi
Sakshi News home page

పొన్నాలకు మతిభ్రమించింది: శ్రీనివాస్‌గౌడ్

Sep 29 2014 1:11 AM | Updated on Sep 2 2017 2:04 PM

ప్రజల అవసరాల మేరకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్ ....

ఖమ్మం: ప్రజల అవసరాల మేరకు సంక్షేమ పథకాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మతిభ్రమించి విమర్శలు చేస్తున్నారని టీజీవో మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఓటమిని జీర్ణించుకోలేక పొన్నాల అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర ఉద్యోగులు పెత్తనం చెలాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇకనైనా తమ ఆధిపత్యాన్ని వీడాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement