మాజీ మంత్రి పొన్నాలకు తప్పిన ప్రమాదం 

Ponnala Lakshmaiah Escaped From Road Accident At Jubilee Hills - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 1/45 చౌరస్తాలో సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే కారులో నుంచి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్‌లోకి వెళ్లిన సమయంలోనే ఈ ఉదంతం చోటు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పొన్నాల తన మనవడితో కలిసి కారులో జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌–1 వైపు షాప్‌కు వచ్చాడు. కారు పక్కన ఆపి లోపలికి వెళ్లాడు. అదే సమయంలో సినిమా షూటింగ్‌ వాహనం రివర్స్‌ తీసుకునే క్రమంలో చూసుకోకుండా పొన్నాల కారు ముందు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top