చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు | Police file charge sheet in ramya accident case | Sakshi
Sakshi News home page

చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు

Nov 18 2016 11:30 AM | Updated on Aug 21 2018 5:51 PM

చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు - Sakshi

చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు

చిన్నారి రమ్య కేసులో పోలీసులు శుక్రవారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య కేసులో పోలీసులు శుక్రవారం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు నెలల తర్వాత 13 పేజీల ఛార్జ్షీట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.  ఈ ఏడాది జులై 1వ తేదీన శ్రావిల్‌ అనే మైనర్ తన అయిదుగురు స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం సేవించి కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అనంతరం ఎదురుగావస్తున్న కారుపై పడిన విషయం తెలిసిందే.

ఈ దుర్ఘటనలో పమ్మి రాజేష్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లి తొమ్మిది రోజుల తర్వాత మృతి చెందింది. పక్కనే కూర్చున్న తాత మధుసూదనాచారి(65)  18 రోజులపాటూ మృత్యువుతో పొరాడి తుదిశ్వాస విడిచారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రావల్ కు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement