-
చిన్నారి రమ్య కేసులో ఛార్జిషీట్ దాఖలు
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య కేసులో పోలీసులు శుక్రవారం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు నెలల తర్వాత 13 పేజీల ఛార్జ్‌షీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జులై 1వ తేదీన శ్రావిల్ అనే మైనర్ తన అయిదుగురు స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం సేవించి కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం ఎదురుగావస్తున్న కారుపై పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పమ్మి రాజేష్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న చిన్నారి రమ్య(8)కి తీవ్ర గాయాలు కావడంతో కేర్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లి తొమ్మిది రోజుల తర్వాత మృతి చెందింది. పక్కనే కూర్చున్న తాత మధుసూదనాచారి(65) 18 రోజులపాటూ మృత్యువుతో పొరాడి తుదిశ్వాస విడిచారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రావల్ కు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. -
రమ్య కేసులో శ్రావిల్‌కు చుక్కెదురు
బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి చిన్నారి రమ్యతో పాటు ముగ్గురి మృతికి కారణమైన విద్యార్థి ఆర్.శ్రావిల్‌కు హైకోర్టులోనూ చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ తీర్పు వెలువరించారు. బెయిల్ కోసం శ్రావిల్ రెండు సందర్భాల్లో పిటిషన్లు దాఖలు చేయగా, నాంపల్లి కోర్టు వాటిని కొట్టేసింది. దీంతో అతను హైకోర్టులో ఇటీవల బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. 304 పార్ట్ 2 కింద కేసు మార్చడం సబబే... పిటిషనర్ తరఫు న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ... పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ బెయిలబుల్ నేరాలేనన్నారు. మొదట నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు 304ఎ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆ తరువాత దానిని 304 పార్ట్ 2 కింద మార్చారన్నారు. ఇది పిటిషనర్లకు వర్తించదన్నారు. ఈ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, అదనపు పీపీ రామిరెడ్డి తోసిపుచ్చారు. శ్రావిల్‌వల్ల ముగ్గురు మరణించారని, ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 304 పార్ట్ 2 కింద కేసు పెట్టారన్నారు. పిటిషనర్, అతని మిత్రులు మద్యం తాగినట్లు సాక్ష్యాలున్నాయన్నారు. అంతేకాక పిటిషనర్‌కు తగిన లెసైన్స్ కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. అధిక వేగంతో నిర్లక్ష్యంగా, అది కూడా మద్యం మత్తులో కారు నడిపి వేరొకరి మృతికి కారణమైనప్పుడు అతనిపై సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు పెట్టవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కాబట్టి పిటిషనర్‌పై 304 పార్ట్ 2 కింద కేసు పెట్టడం చెల్లదన్న వాదన సరికాదని తేల్చి చెప్పారు. 304ఎను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న వాదనలను ఈ దశలో ఆమోదించలేమన్నారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉం దని, అందువల్ల ఈ దశలో బెయిల్ మం జూరు చేయడం సాధ్యం కాదంటూ, శ్రావిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement