కిడ్నాప్ గ్యాంగ్‌ పట్టివేత | Police breaks kidnap gang | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ గ్యాంగ్‌ పట్టివేత

Jan 23 2015 5:11 PM | Updated on Aug 21 2018 5:46 PM

శుక్రవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన యువతిని షేక్ బషీరాబాద్ పోలీసులు రక్షించారు.

కుత్బుల్లాపూర్: శుక్రవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన యువతిని షేక్ బషీరాబాద్ పోలీసులు రక్షించారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువు వద్ద కిడ్నాప్ గ్యాంగ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి ఉమామహేశ్వరీ కాలనీకి చెందిన రేణుక(19) అనే యువతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కిడ్నాప్ అయింది.

పది మంది గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. గతంలో యువతితో నిశ్చితార్థం జరిగిన వినోద్ అనే వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. వినోద్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాకు చెందిన వ్యక్తి.  షేక్‌బషీరాబాద్ సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ పక్కా పథకం ప్రకారం కిడ్నాపైన 2 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement