పోలీసులపై గ్రామస్తుల దాడి | police attacked by villagers in karimnagar district | Sakshi
Sakshi News home page

పోలీసులపై గ్రామస్తుల దాడి

Feb 12 2016 7:19 PM | Updated on Aug 21 2018 5:52 PM

కేసు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు.

కరీంనగర్ : కేసు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇటీవల గ్రామానికి చెందిన ఓదెలు, మందల శ్రీనివాస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారిరువురు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు గ్రామానికి వెళ్లారు. ఆ క్రమంలో గ్రామస్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది.  గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులను చుట్టిముట్టి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని.... గ్రామస్తులను, పోలీసులు శాంత పరిచారు. అనంతరం పోలీసులు వెనుతిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement