ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: యువకుడు మృతి | One killed and one injured in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: యువకుడు మృతి

Oct 30 2015 5:09 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సుల్తానాబాద్ (కరీంనగర్) : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్  మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన సంపత్(27) తన స్నేహితుడు సతీష్‌తో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందగా.. సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement