వృద్ధ దంపతుల ఆత్మహత్య | old Couple Suicide | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల ఆత్మహత్య

Mar 6 2017 10:46 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

జెన్నారం(మంచిర్యాల): వృద్ధ దంపతులకు కొడుకు మాటలు కంఠ విషంగా మారాయి. కొడుకు మాటలు మింగుట పడని ఆదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ సంఘటన జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో తలెత్తిన వివాదాల్లో కొడుకుతో మనస్పర్థలు రావడంతో.. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement