రంగారెడ్డి డీసీసీబీ.. తాత్కాలికంగా టీఆర్‌ఎస్ కైవసం | No Confidence Motion on dccb chairman in rangareddy | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి డీసీసీబీ.. తాత్కాలికంగా టీఆర్‌ఎస్ కైవసం

Apr 30 2015 5:30 PM | Updated on Oct 17 2018 6:18 PM

రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గత స్థానికసంస్థల ఎన్నికల్లో డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే.

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గత స్థానికసంస్థల ఎన్నికల్లో డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్‌గా లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు.

 

అయితే సంవత్సరం కూడా గడవకముందే.. టీఆర్‌ఎస్ ప్రలోభపెట్టడం మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ తన పావులను చాకచక్యంగా కదుపుతోంది. తాజాగా గురువారం రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. తాత్కాలిక చైర్మన్‌గా టీఆర్‌ఎస్కు చెందిన పెంటారెడ్డిని ఎన్నుకున్నారు. మే 2న కొత్త చైర్మన్‌ను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement