కొత్త ఇంటికి నిద్రకొస్తే.. పాత ఇంట్లో చోరీ | New home Old house, Theft | Sakshi
Sakshi News home page

కొత్త ఇంటికి నిద్రకొస్తే.. పాత ఇంట్లో చోరీ

Apr 27 2016 2:33 AM | Updated on Oct 17 2018 4:13 PM

కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో రాత్రి నిద్ర చేద్దామని వస్తే వారి పాత ఇంట్లో దొంగలు పడిన సంఘటన మండలంలోని...

సదాశివపేట(బచ్చన్నపేట) : కొత్తగా కొనుగోలు చేసిన ఇంట్లో రాత్రి నిద్ర చేద్దామని వస్తే వారి పాత ఇంట్లో దొంగలు పడిన సంఘటన మండలంలోని నక్కవానిగూడెం శివారు సదాశివపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈదులకంటి మల్లారెడ్డి బచ్చన్నపేట గోపాల్‌నగర్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. రాత్రి నిద్ర చేద్దామని కుటుంబ సభ్యులంతా కొత్త ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం లేచి ఇంటికి వెళ్లేసరికి తాళం పగులగొట్టి కింద పడేసి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులగొట్టి అందులోని రూ.95 వేల విలువగల బంగారం కనిపించలేదు. చేర్యాల సీఐ చంద్రశేఖర్, ట్రైనీ ఎస్సై వీరేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement