నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన | Minister KTR Sircilla Rajanna District Tour | Sakshi
Sakshi News home page

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

Jun 2 2017 2:35 AM | Updated on Aug 30 2019 8:24 PM

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన - Sakshi

నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటిస్తారని మంత్రి వ్యక్తిగత అదనపు కార్యదర్శి జి.శ్రీనివాస్‌ గురువారం సాయంత్రం తెలిపారు.

సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటిస్తారని మంత్రి వ్యక్తిగత  అదనపు కార్యదర్శి జి.శ్రీనివాస్‌ గురువారం సాయంత్రం తెలిపారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట నివాసం నుంచి బయలుదేరి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు ముస్తాబాద్‌ మండలం ఆవునూరులో ఎస్సీ(మాల) కమ్యునిటీ హాల్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1గంటలకు ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌లో ఐదు వేల మెట్రిక్‌టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంను ప్రారంభిస్తారు. అనంతరం వేబ్రిడ్జికి శంకుస్థాపన చేస్తారు. 3 గంటలకు ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌లో వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పోత్గల్‌ నుంచి బయలుదేరి 6.30 గంటలకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకుంటారని వివరించారు. మంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement