రెండు నెలల్లో ఎల్బీనగర్‌ మెట్రోమార్గం రెడీ! | Metro Rail Available In Two Months Said By KTR | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో ఎల్బీనగర్‌ మెట్రోమార్గం రెడీ!

May 1 2018 1:48 PM | Updated on Oct 16 2018 5:04 PM

Metro Rail Available In Two Months Said By KTR - Sakshi

చింతలకుంట వద్ద అండర్‌ పాస్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎల్బీనగర్ చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద అండర్ పాస్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.  అండర్‌ పాస్‌ను సుమారు రూ.12.70 కోట్లతో నిర్మించారు. నేటి నుంచి అండర్‌ పాస్‌ అందుబాటులోకి రానుంది.  ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు  తెలిపారు. ఎల్బీనగర్ మార్గంలో రెండు నెలల్లో మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

నగరంలోని 52 రద్దీ ప్రాంతాలలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌లు  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్డీపీతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.3 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement